Page Loader
మధ్యప్రదేశ్ లో దారుణం.. 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్‌ లైంగికదాడి
మధ్యప్రదేశ్ లో దారుణం.. 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్‌ లైంగికదాడి

మధ్యప్రదేశ్ లో దారుణం.. 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్‌ లైంగికదాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2023
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. రేవా జిల్లాకు చెందిన ఈ బాలుడు సాత్నాలోని సరస్వతి విద్యాపీఠ్‌ హయ్యర్‌ సెకండరీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. బాలుడు ఆరోగ్యం బాగాలేకపోవడంతో క్లాస్‌లకు వెళ్లకుండా తన హాస్టల్‌ గదిలోనే ఉన్నాడు. అదే సమయంలో హాస్టల్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్న రవీంద్ర సేన్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు.ఈ సంఘటన గురించి ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ప్యూన్ పై ఫిర్యాదు చెయ్యడం కోసం ప్రిన్సిపాల్‌ వద్దకు వెళ్లగా అతడు వారిని కలవడానికి నిరాకరించాడు.

Details 

పోలీసుల అదుపులో నిందితుడు 

ఈ నేపథ్యంలో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ 377 సెక్షన్‌తోపాటు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.