జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ
దేశంలోని పరిస్థితులపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ ఛీప్ మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. ప్రజలు తుపాకాలు చేత పట్టుకొని ఒకరినొకరు కాల్చుకుంటున్నారని, ఇలాంటి ఘటనలు భారత్ లో ఇంతవరకూ చూడలేదని ఆమె చెప్పారు. తరుచూ ఇలాంటి ఘటనలు పాకిస్థాన్, సిరియాలో చూస్తామని, దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఇండియాలో చూడాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు. అక్కడ అల్లాహు అక్బర్ అంటూ ప్రజలను చంపేస్తున్నారని, ఇక్కడ జై శ్రీరామ్ అంటూ చంపుతున్నారని, ఈ రెండిటికి తేడా ఏముందని ఆమె ప్రశ్నించారు.
ప్రజలు తుపాకులతో కాల్చుకొనే స్థాయికి దేశాన్ని తీసుకొచ్చారు
ప్రజలు తుపాకులతో కాల్చుకొనే స్థాయికి దేశాన్ని తీసుకొచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మెహబూబా ముఫ్తి మండిపడ్డారు. బీజేపీ మళ్లీ గాడ్సేలను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యం చేసుకొని బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్నారు. విపక్షాల కూటమిపై ఆమె స్పందిస్తూ గాడ్స్ ఇండియా, గాంధీ, నెహ్రూ, పటేల్ కలలుగన్న ఇండియా మధ్య పోరాటమని ఆమె పేర్కొన్నారు.