కేరళ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని కలమస్సేరిలో క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఓ వ్యక్తి కేరళ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. క్రైస్తవ కన్వెన్షన్ సెంటర్‌లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి మూడు బాంబులను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్లకు బాధ్యత వహిస్తూ.. మార్టిన్ అనే వ్యక్తి త్రిసూర్ రూరల్‌లోని కొడకరా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని కేరళ ఏడీజీపీ అజిత్ కుమార్ చెప్పారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పేలుళ్ల వెనుక నిజంగా మార్టిన్ హస్తం ఉందా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతం విచారిస్తున్నారు.