Page Loader
Nitish Kumar: నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

Nitish Kumar: నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2024
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. తాజా ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన గోవింద్ యాదవ్ దాఖలు చేశారు. నితీశ్‌ కుమార్‌ ఎన్నిక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29ఏ(9)కు అనుగుణంగా జరగలేదని ఆయన ఆరోపణలు చేశారు.

Details

ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకోమన్న కోర్టు

పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ పుష్పేందర్ కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం, పిటిషనర్‌ పేర్కొన్న అంశాలు విచారణ పరిధికి సంబంధించినవి కావని స్పష్టం చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ కేసుకు వర్తించవని పేర్కొంది. ఎన్నికల ఫలితాల్లో కోర్టు జోక్యం చేసుకోదని వెల్లడించింది. పిటిషన్‌లో సరైన ఆధారాలు లేవని పరిగణించిన ఢిల్లీ హైకోర్టు దానిని డిస్‌మిస్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.