LOADING...
Pahalgam Terror Attack: ఉగ్రవాదుల ఫోన్లతో ఫైసల్ బ్యాంక్‌కు సంబంధం.. దర్యాప్తులో కీలక వివరాలు
ఉగ్రవాదుల ఫోన్లతో ఫైసల్ బ్యాంక్‌కు సంబంధం.. దర్యాప్తులో కీలక వివరాలు

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల ఫోన్లతో ఫైసల్ బ్యాంక్‌కు సంబంధం.. దర్యాప్తులో కీలక వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లలో ఒకదానికి సంబంధించి కన్సైన్‌మెంట్‌ ఫైనాన్స్‌ను పాక్‌లోని ఫైసల్‌ బ్యాంక్‌ చేసినట్లు గుర్తించారు. అయితే ఈ ఉగ్రదాడిలో బ్యాంక్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.

వివరాలు 

ఉగ్రవాదుల వద్ద రెండు షావోమి ఫోన్లు

దర్యాప్తు సందర్భంగా ఉగ్రవాదుల నుంచి రెండు షావోమి మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఒక ఫోన్‌ను కరాచీకి చెందిన టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2021లో దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. ఆ దిగుమతికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఫైసల్ బ్యాంక్ ఫైనాన్స్ చేసినట్లు విచారణలో తేలింది. గతంలోనూ ఫైసల్ బ్యాంక్ పేరు ప్రస్తావన ఫైసల్ బ్యాంక్ పేరు గతంలో కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాల ఆరోపణల నేపథ్యంలో వినిపించింది. లష్కరే తయ్యిబా, లజ్‌నత్ అల్ దవా, అల్-ఖైదాతో అనుబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కువైట్‌కు చెందిన ఒక సంస్థ గతంలో ఈ బ్యాంక్‌తో కలిసి పనిచేసినట్లు సమాచారం.

వివరాలు 

దాడి కోసం ప్రత్యేకంగా దాచిపెట్టిన ఫోన్లా?

అలాగే 2007లో అమెరికాకు చెందిన ఓ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం,పాకిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు ఉగ్రవాదసంస్థలు తమ డిపాజిట్లను ఈ బ్యాంక్‌లో నిర్వహించినట్లు పేర్కొంది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఫైసల్ జాట్ తన వెంట రెండు మొబైల్ ఫోన్లను తీసుకొచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇవి షావోమి రెడ్‌మీ 9టీ,రెడ్‌మీ నోట్ 12మోడళ్లకు చెందినవి.ఈ ఫోన్లు వరుసగా 2021,2023 సంవత్సరాల్లో దిగుమతి చేయబడ్డాయి. అయితే ఆశ్చర్యకరంగా,ఈ ఫోన్లు పహల్గాం దాడికి ముందు ఎక్కడా వినియోగంలోకి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. ఎంపిక చేసిన ఉగ్రవాదికి అప్పగించే ఉద్దేశంతో వాటిని కొనుగోలు చేసినప్పటి నుంచి స్విచ్ ఆఫ్‌లోనే ఉంచి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.ఈ కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.

Advertisement