Page Loader
ఆస్కార్ గెలిచిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగును చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు
ఆస్కార్ గెలిచిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఎనుగును చూసేందుకు తరలివస్తున్న పర్యాటకలు

ఆస్కార్ గెలిచిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగును చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు

వ్రాసిన వారు Stalin
Mar 14, 2023
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్' ద్వారా ప్రసిద్ధి చెందిన ఏనుగును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి తరలి వస్తున్నారు. తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లో రెండు అనాథ ఏనుగులను దత్తత తీసుకున్న కుటుంబం చుట్టూ 'ఎలిఫెంట్ విస్పరర్స్' సినిమా కథాంశం తిరుగుతుంది. ఏనుగులను చూడటానికి వచ్చిన పర్యాటకులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉందని ఒక పర్యాటకుడు చెప్పాడు.

ఆస్కార్

గునీత్ మోంగా ఆస్కార్ అందుకోవడం ఇది రెండోసారి

సోమవారం జరిగిన 95వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో తమిళ డాక్యుమెంటరీ దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా ఆస్కార్‌ను అందుకున్నారు. గునీత్ మోంగా ఆస్కార్ అందుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2019లో రూపొందించిన డాక్యుమెంటరీ 'పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్' ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. ఆదివాసీలు, జంతువులను హైలైట్ చేసే తమ చిత్రాన్ని గుర్తించినందుకు అకాడమీకి దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్ ధన్యవాదాలు తెలిపారు.