Page Loader
Saudi Airlines: హజ్ యాత్రికులతో విమానం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
హజ్ యాత్రికులతో విమానం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Saudi Airlines: హజ్ యాత్రికులతో విమానం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో ఎయిర్‌పోర్టులో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. సౌదీ అరేబియాకు చెందిన ఎయిర్‌లైన్స్‌ విమానం (SV 3112) 250 మంది హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి శనివారం రాత్రి 11:30 గంటలకు బయలుదేరి, ఆదివారం ఉదయం 6:30కి లఖ్‌నవూలోని అమౌసి విమానాశ్రయానికి చేరుకుంది. విమానం రన్‌వేపై దిగిన అనంతరం టాక్సీవే మార్గంలో వెళ్తుండగా దాని ఎడమ టైర్ నుంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు రావడంతో పాటు దట్టమైన పొగలు వెలువడాయి. ఈ ఘటనపై సోమవారం అధికారులు వివరాలు వెల్లడించారు. అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ అధికారులకు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Details

మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది

దాదాపు 20 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దించారు. ఘటన స్థలంలో తీవ్ర ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నా, ఎవరికీ గాయాలు కాకపోవడం కొంత ఉపశమనం కలిగించింది. అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ ఘటనకు కారణం సాంకేతిక లోపమేనని గుర్తించారు. విమానం ల్యాండింగ్ సమయంలో ఎడమ చక్రం సరిగ్గా పనిచేయకపోవడంతో మంటలు చెలరేగాయని వెల్లడించారు. ఈ అప్రమత్తత కారణంగా ఓ భారీ ప్రమాదం నివారించబడింది. ప్రస్తుతం విమానాన్ని మరమ్మతుల కోసం నిర్ధిష్ట ప్రాంతానికి తరలించగా, తదుపరి విచారణ కొనసాగుతోంది.