Pm Internship Scheme: నేటి నుంచి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం.. ప్రాసెస్ ప్రయోజనాలను తెలుసుకోండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్‌లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించారు. ఇది నేటి నుండి అమలులోకి రానుంది. ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ త్వరలో ప్రారంభమవుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 12 నుండి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా వచ్చే 5సంవత్సరాల్లో దేశంలోని 500 ప్రముఖ కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఇంటర్న్‌షిప్ పొందే వారికి నెలకు రూ.5,000,ఏకమొత్తంలో రూ.6,000 అలవెన్స్ ఇవ్వబడుతుంది. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం 12నెలల అనుభవం అందించబడుతుంది. కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల నుండి శిక్షణ, ఇతర ఖర్చులలో 10 శాతం భరిస్తాయి.
'అమృత్' ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ 'అమృత్' ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది పరిశుభ్రతకు సంబంధించిన 10 వేల కోట్ల రూపాయలతో రూపొందించిన ప్రాజెక్ట్. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో మిషన్ అమృత్, అమృత్ 2.0 లో భాగం. ఈ ప్రాజెక్టుల కింద దేశంలోని అనేక నగరాల్లో నీరు, వ్యర్థాల శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
స్వచ్ఛ భారత్ మిషన్‌పై ప్రధాని మోదీ
స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇది కోట్లాది మంది భారతీయుల నిబద్ధతకు ప్రతీక అని, ప్రపంచంలోనే అతిపెద్ద మరియు విజయవంతమైన సామూహిక ఉద్యమం అని అభివర్ణించారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం పరిశుభ్రత ప్రధానమైనదని, ఈ మిషన్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని, సఫాయి మిత్రలు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహచరులను ప్రశంసించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతులు కూడా ఈ ఉద్యమానికి తోడ్పడారని, ఈ ఉద్యమం సర్క్యులర్ ఎకానమీకి కొత్త దిశను ఇచ్చిందని అన్నారు.