Page Loader
PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 
అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ

PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Stalin
Aug 27, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో జరిగిన బిజినెస్ 20(బీ-20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రసంగం చేశారు. బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్‌కు అప్పగించిన సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు. ఆగస్టు 23న చంద్రయాన్‌-3ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేయడంతో భారతదేశంలో పండుగల సీజన్‌ ప్రారంభమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో వేడుకలు జరుగుతున్న సమయంలో వ్యాపారుయం బీ20 సదస్సుకు వచ్చారని మోదీ వివరించారు. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యత్వం పొందేందుకు ఆహ్వానించామని ఆయన తెలిపారు. చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం చేయడంలో ఇస్రో కీలక పాత్ర పోషించినట్లు మోదీ పేర్కొన్నారు. ఇందులో భారతదేశ పరిశ్రమలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయన్నారు. దీంతో ఈ వేడుక భారతదేశ వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడుతుందన్నారు.

మోదీ

కరోనా కాలంలో 150 కంటే ఎక్కువ దేశాలకు కరోనా మందుల సరఫరా: మోదీ

భారతదేశం అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని, సమర్థవంతమైన, విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించడంలో తమ దేశం ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌లను భారత్ సరఫరా చేసిన విధానాన్ని, 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్'గా దేశం అవతరించిన అంశాన్ని మోదీ గుర్తు చేశారు. ప్రపంచానికి మందులు అవసరమైనప్పుడు, కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశం 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్'గా 150 కంటే ఎక్కువ దేశాలకు మందులను అందించినట్లు గుర్తు చేశారు. ప్రపంచానికి కోవిడ్ ఔషధం అవసరమైనప్పుడు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు భారతదేశం తన సొంత వ్యాక్సిన్ల ఉత్పత్తిని మెరుగుపరిచిందన్నారు.

మోదీ

క్రిప్టోకరెన్సీలకు సమగ్రమైన గ్లోబల్ విధానం అవసరం: మోదీ

క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడానికి తమ దేశానికి సమగ్ర విధానం అవసర ఉందని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమ 4.0 యుగంలో భారతదేశం డిజిటల్ విప్లవానికి ముఖంగా మారిందన్నారు. విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించడంలో కూడా ముఖ్యమైన స్థానాన్ని భారత్ కలిగి ఉందన్నారు. అలాగే ఏడాకోసారి 'అంతర్జాతీయ వినియోగదారుల సంరక్షణ దినోత్సవాన్ని' నిర్వహించుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వినియోగదారుల సంరక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. క్రిప్టోకరెన్సీలపై గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్, కృత్రిమ మేధస్సు (AI) యొక్క నైతిక వినియోగం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ ప్రసంగం