LOADING...
PM Modi: ఈ 9 పనులు చేస్తామని మాటివ్వండి.. ప్రజలతో ప్రమాణం చేయించిన మోదీ
ఈ 9 పనులు చేస్తామని మాటివ్వండి.. ప్రజలతో ప్రమాణం చేయించిన మోదీ

PM Modi: ఈ 9 పనులు చేస్తామని మాటివ్వండి.. ప్రజలతో ప్రమాణం చేయించిన మోదీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 15, 2026
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్రంలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల నుండి తొమ్మిది ముఖ్యమైన వాగ్దానాలు కోరారు. "వికసిత్ కర్ణాటక నిర్మాణం కోసం మీ అందరి నుంచి నాకు తొమ్మిది హామీలు కావాలి. మీరు ఈ హామీలను నిజాయతీగా, కట్టుబాటుగా పాటిస్తే కర్ణాటక మాత్రమే కాదు, దేశం మొత్తం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుంది" అని ఆయన అన్నారు.

వివరాలు

ప్రధాని కోరిన ఆ తొమ్మిది హామీలివే..

నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలి. ప్రజా ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం మన బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ తల్లిపేరు మీద ఒక మొక్కను నాటాలి. 'వోకల్ ఫర్ లోకల్' భావనను ప్రోత్సహిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ఆదరించాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ దేశాన్ని పచ్చదనం వైపు తీసుకెళ్లాలి. రసాయనాల వినియోగం లేకుండా సాగు విధానాలను అనుసరించాలి. మన ఆహారంలో మిల్లెట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి, బరువును నియంత్రణలో ఉంచుతూ ప్రకృతికి సేవ చేయాలి. అదనంగా, ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ప్రస్తావిస్తూ, ఈ పథకం ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని మోదీ తెలిపారు.

Advertisement