Narendra Modi: ప్రసంగంలో తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని
దేశం ఈరోజు ఆగస్టు 15న 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకి ఎర్రకోట ప్రాకారాలపై నుంచి అత్యధిక సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం లభించింది. ప్రధాని మోదీ 2014 నుంచి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. ఈసారి 2024లో ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. దాదాపు 97 నిమిషాల పాటు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని మోదీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.
ప్రధాని మోదీ ఏ సంవత్సరంలో, ఎంతసేపు ప్రసంగించారు?
గతేడాది ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని మోదీ 90 నిమిషాల పాటు ప్రసంగించారు. 2015లో ప్రధాని మోదీ 86 నిమిషాల ప్రసంగం ద్వారా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సుదీర్ఘ ప్రసంగ రికార్డును బద్దలు కొట్టారు. ఈ ఏడాది ఆయన 97 నిమిషాల ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎర్రకోటపై నుంచి 11 సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటపై నుంచి దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన 65 నిమిషాల పాటు ప్రసంగించారు.ఆ తర్వాత 2015లో దేశాన్ని ఉద్దేశించి 86 నిమిషాల పాటు ప్రసంగించారు.
2017లో అతి చిన్న ప్రసంగం
దేశం 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి 94నిమిషాల పాటు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఎర్రకోటపై నుంచి చేసిన సుదీర్ఘ ప్రసంగం ఇదే.ఇప్పుడు ఈ రికార్డు బద్దలైంది. ప్రధాని మోదీ ఒక్కసారి మాత్రమే గంట కంటే తక్కువ సమయం పాటు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2017లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని చేసిన ప్రసంగం కేవలం 56నిమిషాలు మాత్రమే. ఇప్పటి వరకు ఇదే ఆయన అతి చిన్న ప్రసంగం.2018లో 82 నిమిషాలు,2019లో 92 నిమిషాలు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దీని తర్వాత,ప్రధాని మోదీ ఎర్రకోట నుండి 2020లో 86 నిమిషాలు,2021లో 88 నిమిషాలు,2022లో 83 నిమిషాలు,2023లో 90 నిమిషాలు ప్రసంగించారు.
బద్దలైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రికార్డును మోదీ బద్దలుకొట్టారు. మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 మధ్య ఎర్రకోట ప్రాకారాల నుండి 10 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విషయంలో మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మోదీ మూడో స్థానానికి చేరుకున్నారు. నెహ్రూ 17 సార్లు, ఇందిర 16 సార్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు.