Ebrahim Raisi: ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మరణంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ''ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్-ఇరాన్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విచారకర సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం'' అని ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా రైసీ ఆకస్మిక మరణంపై సంతాపం తెలిపారు. అయన ఇరాన్ కౌంటర్ అమిరాబ్డోల్హియాన్‌ను కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేశారు.