Page Loader
Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ 
Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ

Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Stalin
Dec 20, 2023
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి కళ్యాణ్ బెనర్జీ అవమానకరంగా మిమిక్రీ చేయడం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసిన మాట్లాడినట్లు ఉపరాష్ట్రపతి ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. గత 20ఏళ్లుగా తాను ఇలాంటి అవమానాలు అనుభవిస్తున్నట్లు మోదీ తనతో చెప్పారని జగదీప్ ధన్‌ఖర్‌ పేర్కొన్నారు. అయితే కొంతమంది చర్యలు తనను ఆపవని తాను మోదీకి చెప్పానన్నారు. తన విధిని నిర్వర్తిస్తున్నానని, రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు అనుగూనంగా ముందుకెళ్తున్నానని వివరించారు. తనను అవమానించినా.. తన మార్గం మారదని మోదీకి చెప్పినట్లు ఉపరాష్ట్రపతి వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉప రాష్ట్రపతి ట్వీట్