LOADING...
PM Modi: ఇంధన పొదుపుకు ప్రధాని చర్యలు.. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు
ఇంధన పొదుపుకు ప్రధాని చర్యలు.. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు

PM Modi: ఇంధన పొదుపుకు ప్రధాని చర్యలు.. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వయంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తన అధికారిక కాన్వాయ్‌లో ఉపయోగించే వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల దేశ ప్రజలకు అవసరం లేని ప్రయాణాలను తగ్గించి ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని సూచించిన విషయం తెలిసిందే. అదే విధానాన్ని ప్రభుత్వ వ్యవస్థలోనూ అమలు చేయాలని భావించిన మోదీ.. తన కాన్వాయ్‌లో వాహనాల వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రత్యేక రక్షణ బృందం అధికారులకు సూచించినట్లు తెలిసింది.

వివరాలు 

వాహనాల సంఖ్య తగ్గించే చర్యలు చేప్పట్టిన పలువురు నాయకులు 

అంతేకాకుండా కాన్వాయ్‌లో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాలని కూడా ఆయన ఆదేశించారు. అయితే, ఇందుకోసం కొత్త వాహనాల కొనుగోలు చేయవద్దని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. భద్రతా నిబంధనలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ మార్పులను అమలు చేసే దిశగా ప్రత్యేక రక్షణ బృందం చర్యలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రధాని సూచనల ప్రభావంతో పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య తగ్గించే చర్యలు చేపట్టారు. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇప్పటికే తమ అధికారిక వాహన బృందాలను పరిమితం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement