PM Modi Tejas: తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన మోదీ.. ఫొటోలు వైరల్
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీలో తయారైన యుద్ధ విమానాలను మోదీ పరిశీలించారు. అనంతరం మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫొటోలను మోదీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. తేలికపాటి ఆలివ్ పైలట్ యూనిఫాం, తలపై బాలిస్టిక్ హెల్మెట్, కళ్లకు UV గాగుల్స్ పెట్టుకొని మోదీ దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. తాను తేజస్‌లో విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తిచేసినట్లు మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ అనుభవం నన్ను కట్టిపడేసిందన్నారు.