LOADING...
PM Modi: ఫ్రాన్స్, స్లోవేకియా అగ్రనేతలకు మోదీ ప్రత్యేక కానుకలు.. వాటి విశిష్టత ఇదే!
ఫ్రాన్స్, స్లోవేకియా అగ్రనేతలకు మోదీ ప్రత్యేక కానుకలు.. వాటి విశిష్టత ఇదే!

PM Modi: ఫ్రాన్స్, స్లోవేకియా అగ్రనేతలకు మోదీ ప్రత్యేక కానుకలు.. వాటి విశిష్టత ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించుకుని శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో దౌత్య చర్చలతో పాటు భారతీయ సంస్కృతి, కళలు, హస్తకళల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్చరల్ డిప్లొమసీలో భాగంగా ఆయా దేశాల అగ్రనేతలకు ప్రధాని మోదీ అందించిన ప్రత్యేక బహుమతులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల విశిష్ట కళాఖండాలు, సంప్రదాయ ఉత్పత్తులను ఆయన కానుకలుగా అందించారు.

వివరాలు 

మాక్రాన్‌కు మహాభారత కలంకారీ.. బ్రిగిట్టేకు పోచంపల్లి సిల్క్ స్టోల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహాభారత కలంకారీ పెయింటింగ్‌ను బహూకరించారు. సహజ సిద్ధమైన రంగులు, ప్రత్యేక పెన్ డ్రాయింగ్ పద్ధతిలో రూపొందించే ఈ కళాఖండాన్ని పూర్తి చేయడానికి కళాకారులకు సుమారు ఆరు నెలల సమయం పడుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించే ఘట్టాలతో పాటు శాంతి, నైతిక నాయకత్వం, మానవ విలువలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్‌కు తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇకత్ సిల్క్ స్టోల్‌ను ప్రధాని మోదీ అందించారు. ప్రత్యేక జ్యామితీయ, పూల డిజైన్లతో రూపొందిన ఈ చేనేత వస్త్రం భారతీయ కళాత్మకతకు ప్రతీకగా నిలుస్తుంది.

వివరాలు 

స్లోవేకియా ప్రధానికి కాశ్మీరీ పట్టు తివాచీ

స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు కాశ్మీరీ సిల్క్ కార్పెట్‌ను ప్రధాని మోదీ బహూకరించారు. శ్రీనగర్ ప్రాంత కళాకారులు ప్రకృతి సిద్ధమైన పట్టుతో అత్యంత క్లిష్టమైన డిజైన్లతో చేతితో నేసే ఈ తివాచీల తయారీకి కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు సమయం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇవి విలాసవంతమైన కళాఖండాలుగా గుర్తింపు పొందాయి. స్లోవేకియా అధ్యక్షుడికి హిమ్రూ టై, థేవా కఫ్లింక్స్ స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినికి ప్రధాని మోదీ రెండు ప్రత్యేక కానుకలను అందించారు. ఔరంగాబాద్‌కు చెందిన హిమ్రూ సిల్క్ టై, పాకెట్ స్క్వేర్ సెట్ సిల్క్, కాటన్ మిశ్రమంతో రూపొందించబడింది. ప్రత్యేక రివర్సిబుల్ నేసే విధానానికి ప్రసిద్ధి చెందిన ఈ వస్త్రం జీఐ గుర్తింపు పొందింది.

Advertisement

వివరాలు 

స్లోవేకియా స్పీకర్ రిచర్డ్ రాసికి చరక సంహిత,సుశ్రుత సంహిత గ్రంథాలు 

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన హ్యాండ్‌క్రాఫ్టెడ్ థేవా మోటిఫ్ కఫ్లింక్స్‌ను కూడా ఆయన బహూకరించారు. రంగుల గాజుపై బంగారు రేకులను అమర్చి ప్రకృతి స్ఫూర్తితో రూపొందించే ఈ పురాతన కళ భారతీయ హస్తకళల వైభవాన్ని చాటిచెబుతుంది. దీనికి కూడా జీఐ ట్యాగ్ లభించింది. స్లోవేకియా స్పీకర్ రిచర్డ్ రాసికి భారతీయ ప్రాచీన వైద్య విజ్ఞానానికి సంబంధించిన చరక సంహిత, సుశ్రుత సంహిత గ్రంథాలను ప్రధాని మోదీ బహూకరించారు. ఆయుర్వేదం,శస్త్రచికిత్సల చరిత్రలో భారతదేశ గొప్పతనాన్ని ఈ గ్రంథాలు ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా బీహార్,జార్ఖండ్ రాష్ట్రాల్లో పండుగల సందర్భంగా తయారు చేసే సంప్రదాయ మిఠాయి తెకువాను కూడా ఆయనకు పరిచయం చేశారు. గోధుమ పిండి,బెల్లం,నెయ్యి, సోంపు గింజలతో తయారయ్యే ఈ వంటకం భారతీయ సంప్రదాయ ఆహార సంస్కృతికి నిదర్శనం.

Advertisement

వివరాలు 

భారత వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ

ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనలో ప్రధాని మోదీ అందించిన ప్రతి కానుక భారతదేశంలోని ఒక ప్రాంత సంస్కృతి, హస్తకళ, చేనేత, వైద్య విజ్ఞానం లేదా సంప్రదాయ ఆహారాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేసింది. ఆంధ్రప్రదేశ్ కలంకారీ నుంచి తెలంగాణ పోచంపల్లి, కాశ్మీరీ కార్పెట్, హిమ్రూ వస్త్రాలు, థేవా కళాఖండాలు, ఆయుర్వేద గ్రంథాలు, బీహార్ తెకువా వరకు భారతీయ వైవిధ్యాన్ని విదేశీ అగ్రనేతలకు పరిచయం చేస్తూ సాంస్కృతిక దౌత్యంలో మరో మైలురాయిని ప్రధాని మోదీ నెలకొల్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినికి ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతి 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన బహుమతి | కలంకారి మహాభారత చిత్రం

Advertisement