PM Modi Gifts to Meloni:అస్సామీ శాలువా,సుబ్బలక్ష్మి పాటల సీడీ బహుమతి.. ఇటలీ నేతలకు మోదీ ప్రత్యేక కానుకలు..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా దేశాల ప్రముఖ నేతలకు భారతీయ సంప్రదాయం, కళా వైభవాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కానుకలను అందజేశారు. ఇటలీ అధ్యక్షుడికి తెల్లని పాలరాయితో తయారుచేసిన అందమైన అలంకార పెట్టెను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఈ పెట్టెపై లాపిస్ లాజులి, టర్కోయిస్, మాలకైట్, పగడం వంటి విలువైన రాళ్లతో నాజూకైన అలంకరణ చేశారు. పెట్టె లోపల భారతీయ శాస్త్రీయ సంగీత దిగ్గజాలు పండిట్ భీమ్‌సేన్ జోషి, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన గానాల సీడీలను ఉంచి అందించారు.
వివరాలు
మెలోనికు ముగా పట్టు శాలువా
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికు అస్సాంలో ప్రసిద్ధి చెందిన ముగా పట్టు శాలువాను కానుకగా అందజేశారు. 'బంగారు పట్టు'గా పేరొందిన ఈ ముగా పట్టు తన ప్రత్యేక నాణ్యతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా, మణిపూర్ కు చెందిన శిరుయ్ లిలీ సిల్క్ స్కార్ఫ్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు.