
PM Modi: రికార్డ్ తిరగ రాసిన మోదీ..xలో పెరిగిన ఫాలోవర్ల సంఖ్య.ఏ దేశ ప్రధానికి లేని క్రేజ్
ఈ వార్తాకథనం ఏంటి
మనం సర్వ సాధారణంగా తన రికార్డులు తనే తిరగ రాశారని వింటుంటాం.
ఇది సినిమా హీరోల సంగతి కావచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పుకునేది మన ప్రధాని నరేంద్ర మోదీ గురించి .
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత రికార్డులను బ్రేక్ చేశారు.
ఓ సరికొత్త రికార్డును సృష్టించారు.
దీన్ని ఇప్పట్లో ఎవరూ చెరిపేయలేరు. దారిదాపుల్లోనూ ఎవరూ లేరు.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, దుబాయ్ కింగ్ షేక్ మహ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌నూ దాటేశారు.
ఆ రికార్డే- ఎక్స్ అకౌంట్‌లో ఫాలోవర్ల సంఖ్య. ఎక్స్ అకౌంట్‌లో మోదీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 100 మిలియన్లు.. అంటే 10 కోట్లను అధిగమించింది.
వివరాలు
మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ ఫాలోవర్ల సంఖ్య పెంపు ప్రాధాన్యత
మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2021 నాటికి ఈ సంఖ్య 30 మిలియన్లుగా ఉండేది.
తాజాగా ఇప్పుడది 100 మిలియన్లను అధిగమించింది.
జాతీయ, అంతర్జాతీయంగా దీనితో పోటీ పడే మరో లీడర్ లేరు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారు 26.40 మిలియన్ల మంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- 27.5, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్- 19.9, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ- 7.4, లాలూ ప్రసాద్ యాదవ్- 6.3, తేజస్వి యాదవ్- 5.2, శరద్ పవార్- 2.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.