
PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభం ముందు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, అధికార, విపక్ష సభ్యులకు పార్లమెంట్‌లో సార్థకమైన చర్చలు జరగాలని కోరారు.
ప్రస్తుతం మనం 2024వ సంవత్సరాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నప్పుడు, 2025కు దేశం మొత్తం సిద్ధమవుతుందని చెప్పారు.
ఈ పార్లమెంట్ సమావేశం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనం భారత రాజ్యాంగాన్ని ఆమోదించి, ఈ నవంబర్ 26న 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని మోడీ పేర్కొన్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు రాజ్యాంగ దినోత్సవాన్ని సదన్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
వివరాలు
గూండాయిజం ప్రేరేపించి,పార్లమెంట్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు: మోదీ
అదేవిదంగా,ప్రజల చేత తిరస్కరణకు గురైన కొంతమంది గూండాయిజం ప్రేరేపించి,పార్లమెంట్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.
వారు చేసే చర్యలు దేశ ప్రజల దృష్టికి వస్తున్నాయని,సమయం వచ్చినప్పుడు వారు ఈ చర్యలపై ప్రతిస్పందిస్తారని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఇదివరకటి అంశం గురించి ఆయన మాట్లాడుతూ,కొత్తగా పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రతిఒక్కరూ కొత్త ఆలోచనలతో వచ్చే అవకాశం ఉంది, కానీ కొందరు చేసే గందరగోళ చర్యల వల్ల కొత్త ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో,ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తూ, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే దిశగా వారు ముందుకు పోవాలని కోరారు.
ఇలాంటి వారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదు..కాబట్టి ప్రజల అంచనాలను ఎన్నటికీ అందుకోలేరని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.