Page Loader
PM Modi: తానూ మనిషినే అని, దేవుణ్ని కాదంటూ.. పాడ్‌కాస్ట్ లో ప్రధాని మోదీ 
PM Modi: తానూ మనిషినే అని, దేవుణ్ని కాదంటూ.. పాడ్‌కాస్ట్ లో ప్రధాని మోదీ

PM Modi: తానూ మనిషినే అని, దేవుణ్ని కాదంటూ.. పాడ్‌కాస్ట్ లో ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో జరిగింది. ఈ సందర్భంలో మోదీ, నిఖిల్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను నిఖిల్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, మోదీ దాన్ని రీపోస్ట్ చేశారు. ఈ వీడియోలో మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, తాను కూడా సాధారణ మనిషినేనని, పొరపాట్లు జరగడం సహజమని చెప్పారు. రెండునిమిషాల కంటే ఎక్కువ ఉన్న ఈ ట్రైలర్ వీడియోలో రాజకీయాలు, నాయకత్వం,వ్యవస్థాపకత వంటి పలు అంశాలపై చర్చించారు.

వివరాలు 

ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారో తెలియదు: మోదీ 

నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్ ప్రారంభంలో మాట్లాడుతూ, "ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు కొంచెం భయం వేస్తోంది" అని చెప్పారు. దీనికి మోదీ స్పందిస్తూ, "ఇది నా మొదటి పాడ్‌కాస్ట్. ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారో తెలియదు" అని నవ్వుతూ అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీ సూచన ఏమిటి? అని నిఖిల్ అడగగా, మోదీ సమాధానంగా, "రాజనీతి ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం చాలా అవసరం. వారు మిషన్‌ను పూర్తి చేయడం కోసం రావాలి, కానీ వ్యక్తిగత లక్ష్యాల కోసం కాదు" అన్నారు. తన ముఖ్యమంత్రి కాలంలో జరిగిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ, "అప్పుడు నా ప్రవర్తన తగినంత బాగా ఉండకపోవచ్చు. కానీ, నేనూ మనిషినే, భగవంతుడిని కాదు" అని మోదీ చెప్పారు.

వివరాలు 

విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు

తన మొదటి రెండు ప్రధానమంత్రి పదవీకాలంలో ఎదురైన అనుభవాలను మోదీ పంచుకున్నారు. ఈ ట్రైలర్ వీడియోను రీపోస్ట్ చేస్తూ, "ఈ ఇంటర్వ్యూను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను" అని మోదీ అన్నారు . ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే విడుదల కాగా, పూర్తి ఇంటర్వ్యూ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే, దాని విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్