PM MODI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. స్వామిని ఏం కోరుకున్నాంటే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సందర్శించుకున్నారు. ఈ మేరకు 140 కోట్ల భారతీయులందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. షెడ్యూల్ కంటే ముందే ఉదయం 7.30 గంటలకే ప్రధాని ఆలయాన్ని సందర్శించారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్నప్రధానికి టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం బంగారు వాకిలి మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు. దర్శనానంతరం వకులమాత,విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి చిత్రపటం,తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రధానిగా శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి.