Page Loader
PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్
PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్

PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్

వ్రాసిన వారు Stalin
Dec 04, 2023
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కోపం తెచ్చుకోకుండా పార్లమెంట్‌లో చర్చలు జరపాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్ వేశారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని అందుకుంది.

మోదీ

ఓటమి నుంచి ప్రతిపక్ష నేతలు పాఠాలు నేర్చుకోవాలి: మోదీ

ఓటమి నుంచి ప్రతిపక్ష నేతలు పాఠాలు నేర్చుకోవాలని ప్రధాని మోదీ హితవు పలికారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. సామాన్య ప్రజల సంక్షేమానికి, వారి ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడిన వారికి నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు రాష్ట్రాల్లో మెజారిటీ మార్కును అధిగమించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి ఇది ఘోర పరాజయం. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను గవర్నర్‌లకు అందజేశారు.