LOADING...
Gandhi Jayanti: మహాత్ముని సేవలను స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ
మహాత్ముని సేవలను స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ

Gandhi Jayanti: మహాత్ముని సేవలను స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కి వెళ్లి, గాంధీజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో బాపూకి సంబంధించిన సేవలను గుర్తుచేసుకుంటూ తన భావాలను పంచుకున్నారు. "మన ప్రియమైన బాపూ అసాధారణ జీవితం, ఆయన చూపిన ఆదర్శాలు మానవ చరిత్రను మార్చాయి. ధైర్యం, సాధారణతతో కూడా సమాజంలో గొప్ప మార్పులు తేవచ్చని ఆయన నిరూపించారు. ప్రజాసేవ, పరుల పట్ల కరుణ - ఇవే మన సాధికారతకు గొప్ప ఆయుధాలని ఆయన నమ్మారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం ఆయన చూపిన దారినే మేము అనుసరిస్తాం" అని మోదీ రాసుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం బాపు చూపిన దారినే మేము అనుసరిస్తాం: మోదీ