
Garbo Song : దేశంలో శరన్నవరాత్రుల సందడి.. మోదీ రాసిన 'గర్బా' పాట విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో దసరా నవరాత్రి 2023 సందడి మొదలైంది. గుజరాతీలు ఏటా శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలోనే 'గర్బా' సంప్రదాయ నృత్యంతో అమ్మవారిని స్తుతిస్తారు.
నవరాత్రి ఉత్సవాలకు ముందు గర్బా పాటతో కూడిన ఓ వీడియో రిలీజ్ అయ్యింది. అయితే ఇందులోని పాటలను రాసింది మాత్రం సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం.
'గార్బో' పేరిట సిద్ధమైన ఈ పాటకు తనిష్క్ బాగ్చీ బాణీలు అందించగా, ధ్వని భానుశాలీ ఆలపించారు.
పాట విడుదలైనట్లు ధ్వని చేసిన ట్వీట్ కు స్పందించిన ప్రధాని, పాట రూపకల్పనలో భాగమైనవారికి కృతజ్ఞతలు చెప్పారు.
అప్పట్లో తానే ఈ పాటను రాసినట్లు మోదీ గుర్తుచేసుకున్నారు. తానో కొత్త గర్బా పాట రాశానని, ఈ నవరాత్రుల్లోనే దాన్ని విడుదల చేస్తాన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధాని మోదీ చేసిన ట్వీట్
Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc
— Narendra Modi (@narendramodi) October 14, 2023