PM Modi: మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌ల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో మోదీ
Most Popular Global Leader PM Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన గ్లోబల్ లీడర్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అమెరికన్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' ప్రకారం, మోడీ 76 శాతం రేటింగ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా మోదీ నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు ఒబ్రడార్ 66 శాతం రేటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 37 శాతం రేటింగ్‌తో 8వ స్థానంలో నిలవడం గమనార్హం. గతేడాది మార్నింగ్ కన్సల్ట్ వీక్లీ నిర్వహించిన సర్వేలో కూడా మోదీ మొదటి స్థానాన్నే కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది ఆ స్థానాన్ని నిలుపుకున్నారు.
గ్లోబల్ లీడర్‌గా మోదీ నిలవడంపై బీజేపీ హర్షం
స్విస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్ 58 శాతం రేటింగ్‌తో మూడో స్థానంలో, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా 4వ స్థానంలో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఐదవ స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మలోనీ 41 శాతం రేటింగ్‌తో ఆరో స్థానంలో, బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డి క్రూ 37 శాతం రేటింగ్‌తో 7వ స్థానంలో నిలిచారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ 9వ స్థానంలో ఉన్నారు. చెక్ రిపబ్లిక్ ప్రధాని 16శాతం రేటింగ్‌తో చివరి స్థానంలో నిలిచారు. అంతర్జాతీయ సర్వేల్లో గ్లోబల్ లీడర్‌గా మోదీ నిలవడంపై బీజేపీ ఆనందం వ్యక్తం చేసింది. మోదీ సమర్ధవంతమైన నాయకత్వ సామర్థ్యాలను, దూరదృష్టిని ఈ సర్వే ప్రతిబింబిస్తుందని బీజేపీ అభిప్రాయపడింది.