Page Loader
PM Modi: గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ
PM Modi: గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ

PM Modi: గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Stalin
Feb 27, 2024
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఈ మిషన్‌కు ఎంపికయ్యారు. ఈ నలుగురు భారత వైమానిక దళానికి చెందిన పైలట్లు. ఇస్రోకు చెందిన మూడు ప్రధాన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా కేరళలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని ప్రధాని మోదీ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ నలుగురి పేర్లను వెల్లడించారు.

ఇస్రో

ఈ నలుగురు 140 కోట్ల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్తారు: మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నేడు అందరం ఒక చారిత్రాత్మక ప్రయాణాన్ని చూస్తున్నామన్నారు. తాను ప్రకటించిన నాలుగు పేర్లు.. నాలుగు ప్రాణాలు కావన్నారు. అవి నాలుగు శక్తులన్నారు. 140 కోట్ల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. 40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు మోదీ పేర్కొన్నారు. గగన్‌యాన్ మిషన్ అనేది ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ప్రతిష్టాత్మకమైన మానవ సహిత మిషన్ 'గగన్‌యాన్' కోసం ఈ సంవత్సరం ఇస్రో వరుస పరీక్షలను నిర్వహించింది. 2024ను 'గగన్‌యాన్' సన్నాహాల ఏడాదిగా ఉంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చెప్పుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న మోదీ