తదుపరి వార్తా కథనం
    
     
                                                                                ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక
                వ్రాసిన వారు
                Stalin
            
            
                            
                                    Feb 28, 2023 
                    
                     01:43 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దామోదరదాస్ ముల్చంద్ మోదీ, హీరాబెన్‌లకు జన్మించిన ఐదుగురు పిల్లలలో ప్రహ్లాద్ మోదీ నాలుగో సంతానం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అతనికి కిరాణా దుకాణం, టైర్ షోరూమ్ ఉన్నాయి.
ప్రధాని మోదీ
గతేడాది మైసూరులో కారు ప్రమాదం
గతేడాది డిసెంబర్ 27న కర్ణాటకలోని మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోదీ ప్రమాదానికి గురయ్యారు. ఆయన కుటుంబంతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్ వెళుతుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆగస్ట్ 2, 2022న, ప్రహ్లాద్ మోదీ, ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్) ఆధ్వర్యంలో అనేక మంది సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరించాలని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.