మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నాగాలాండ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షిల్లాంగ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రచారంలో భాగంగా 'మోదీ తేరీ కబర్ ఖుదేగీ' (మోదీ, నీ సమాధి తవ్వబడుతుంది) అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ప్రాధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్‌కు దేశ ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. 'మోదీ తేరా కమల్ ఖిలేగా' (మోదీ, మీ కమలం వికసిస్తోంది) అని ప్రజలు అంటున్నారని కాంగ్రెస్‍కు చురకలు అంటించారు మోదీ. దేశం అంగీకరించడానికి సిద్ధంగా లేని వారు కూడా నినాదాలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
'శాంతి, ప్రగతి, శ్రేయస్సు' నినాదమే మా మంత్రం: ప్రధాని మోదీ
'శాంతి, ప్రగతి, శ్రేయస్సు' నినాదమనే మంత్రం బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరగడానికి కారణమని ప్రధాని చెప్పారు. బీజేపీ హయాంలోనే సరిహద్దు వివాదాలు శరవేగంగా పరిష్కారమవుతున్నాయని మోదీ చెప్పారు. ఫిబ్రవరి 16న జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మోదీ చెప్పారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్ల అది సాధ్యమైందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో నాగాలాండ్‌లో హింసాత్మక సంఘటనలు దాదాపు 75 శాతం తగ్గినట్లు మోదీ చెప్పారు.