అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్
ఈ వార్తాకథనం ఏంటి
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఈసీ ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 2న ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో కలిపి 9,125 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
త్రిపురలో జనవరి 21న, మేఘాలయ, నాగాలండ్‌లో జనవరి 31న నోటిఫికేషన్ వస్తుంది.
త్రిపురలో జనవరి 30లోపు, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 7లోపు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.
త్రిపురలో జనవరి 31న, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 8న నామినేషన్ల పరిశీలన
త్రిపురలో ఫిబ్రవరి 2న, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 10న నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఈసీ సూచించింది.
అసెంబ్లీ ఎన్నికలు
మూడు రాష్ట్రాల్లో 60చొప్పున అసెంబ్లీ స్థానాలు
త్రిపుర: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ 35 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 మంది సభ్యుల గల అసెంబ్లీలో.. బీజేపీ, దాని ప్రత్యర్థి వామపక్షాల మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువగా ఉంది.
మేఘాలయ: 2018ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 60మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. కేవలం 2సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2023ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఎన్‌పీపీ అధినేత సంగ్మా ఇప్పటికే ప్రకటించారు.
నాగాలాండ్:2018లో ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి.. 40నియోజకవర్గాల్లో ఎన్‌డీపీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.