Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశంలో ఈసీ షెడ్యూల్‌ను వెల్లడించనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపురలో ప్రస్తుత శాసన సభల పదవీకాలం మార్చి నెలతో ముగియనుంది. ఇటీవలే ఎన్నికల సంఘం ప్రతినిధులు ఈ రాష్ట్రాల్లో పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు. స్థానిక రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, భద్రతా సిబ్బంది అభిప్రాయాలను తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా సిద్ధమైన నేపథ్యంలో ఈసీ ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ 35 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 మంది సభ్యుల గల అసెంబ్లీలో.. బీజేపీ, దాని ప్రత్యర్థి వామపక్షాల మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువగా ఉంది. 2018ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. దీంతో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి.. 40 నియోజకవర్గాల్లో ఎన్‌డీపీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.