PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్‌సభలో రామమందిర నిర్మాణానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం 42 నిమిషాల పాటు ప్రసంగించారు. గత 5 సంవత్సరాలలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను గురించి మోదీ వివరించారు. గత ఐదేళ్లలో లోక్‌సభలో ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని మోదీ అన్నారు. ఈ కాలంలో మానవజాతి శతాబ్దపు అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని కరోనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 17వ లోక్‌సభలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, మహిళా బిల్లును కూడా ఈ సభలోనే ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఈ సభను దేశం ఆశీర్వదించనున్నది ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 25 సంవత్సరాలు మన దేశానికి చాలా ముఖ్యమైనవనవి మోదీ అన్నారు.
కొత్త ప్రమాణాలను సృష్టించాం: మోదీ
17వ లోక్‌సభ కొత్త ప్రమాణాలను సృష్టించిందని ప్రధాని అన్నారు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు కూడా ఈ కాలంలోనే పూర్తయ్యాయన్నారు. ఈ హయాంలో అనేక సంస్కరణలు జరిగాయన్నారు. 17వ లోక్ సభ గేమ్ ఛేంజర్ లాంటిదని, ఈ సభలో తీసుకున్న నిర్ణయాలు 21వ శతాబ్దపు బలమైన పునాది వేశయాన్నారు. తాము పెద్ద మార్పు దిశగా వేగంగా ముందుకు సాగామన్నారు. ఆర్టికల్ 370ని తొలగించి రాజ్యాంగానికి పూర్తి రూపాన్ని ఈ సభే ఇచ్చినట్లు మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల ఆత్మలు అందరినీ ఆశీర్వదించినట్లు చెప్పారు. ఇందుకోసం సభలోని సహచరులంతా తమ వంతు పాత్ర పోషించారన్నారు.
జీ20కి అధ్యక్షత వహించే అవకాశం
ప్రధానమంత్రి మాట్లాడుతూ.. భారతదేశానికి G20 అధ్యక్షత వహించే అవకాశం లభించింన్నారు. భారతదేశానికి గొప్ప గౌరవం లభించిందన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం భారతదేశ సామర్థ్యాన్ని, దాని గుర్తింపును ప్రపంచం ముందు ప్రదర్శించిందన్నారు. దాని ప్రభావం ఇప్పటికీ ప్రజల మనస్సుపై ఉందన్నారు. స్పీకర్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. 'మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మీ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోలేదు. మీరు ఈ సభను చాలా సందర్భాల్లో సమతుల్యంగా, న్యాయంగా నడిపించారు. దీనికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రత్యారోపణలు చేసినా మీరు ఓపికగా పరిస్థితిని నియంత్రించి సభను నడిపారు' అని మోదీ అన్నారు.