G7 Summit: సదస్సులో పలు దేశాల అధినేతలతో మోదీ చర్చ
ఇటలీలో జీ7 సదస్సు ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి బయలుదేరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఎక్స్‌లో ధృవీకరించారు. "అపులియాలో ముగిసిన G7 సమ్మిట్‌లో చాలా ప్రయోజనకరంగా జరిగాయన్నారు. ప్రపంచ నాయకులతో సంభాషించానని నరేంద్ర మోదీ తెలిపారు. అందరూ కలిసి, ప్రపంచ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడం భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన ఇటలీ ప్రభుత్వానికి, ప్రజలకు అని ప్రధాని మోదీ ఎక్స్‌లో ధన్యవాదాలు చెప్పారు.
G7 సమ్మిట్ ప్రయోజనకరం
శుక్రవారం, ఇటలీలో జరిగిన సమ్మిట్ ఔట్రీచ్ సెషన్‌లో ప్రధాని ప్రసంగించారు. సాంకేతిక పురోగతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచ దక్షిణాదిలో భారతదేశం పాత్ర ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలను ప్రధానంగా ప్రస్తావించారు. సాంకేతికత ప్రయోజనాలు అన్ని వర్గాలకు చేరాలన్నారు."సాంకేతికత ప్రయోజనాలు అన్ని వర్గాలకు చేరేలా మనం సమష్టిగా నిర్ధారించుకోవాలని సూచించారు. సమాజంలోని ప్రతి వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తించి దానిని, సామాజిక అసమానతలను తొలగించడానికి వినియోగించుకోవాలన్నారు. ఇందుకు మానవ సామర్థ్యాలను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జాతీయ వ్యూహాన్ని రూపొందించిన మొదటి కొన్ని దేశాలలో భారతదేశం ఉందని గుర్తు చేశారు.
AI మిషన్ ప్రారంభించిన తొలి దేశం భారత్
"అందరికీ AI" అనే మంత్రంతో ఈ సంవత్సరం AI మిషన్‌ను ప్రారంభించిందని ప్రధాన మంత్రి హైలైట్ చేశారు." ప్రపంచ దక్షిణాదిలో భారతదేశం నిశ్చితులు , ఉద్రిక్తతల భారాన్ని భరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఆయా దేశాల ప్రాధాన్యతలు ఆందోళనలను ప్రపంచ వేదికపై ఉంచడం భారతదేశం తన బాధ్యతగా భావించిందన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తమ దేశం చేసిన కృషిని ప్రపంచ దేశాల దృష్టికి మోడీ తీసుకు వెళ్లారు. గడువుకు ముందే , వాతావరణ మార్పులపై చర్చించే సభ్య దేశాలు("COP )కింద చేసిన అన్ని హామీలను సమయానికి ముందే నెరవేర్చిన దేశం భారతదేశం" అని ఆయన సగర్వంగా చెప్పారు. "2070 నాటికి నికర జీరో లక్ష్యాన్ని సాధించాలనే వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటామని ధీమాగా చెప్పారు.
ప్రజాస్వామ్య ప్రపంచం విజయం
ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావించారు. "సాంకేతికతను సర్వత్రా ఉపయోగించి మొత్తం ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిపామని తెలిపారు. తాను మూడోసారి అధికారంలోకి రావడం గురించి ప్రస్తావిస్తూ, "ఇది మొత్తం ప్రజాస్వామ్య ప్రపంచం విజయంగా మోడీ అభివర్ణించారు". అంతేకాకుండా, వేదిక వద్ద పోప్ ఫ్రాన్సిస్‌ను ప్రధాని మోదీ అభినందించారు. భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ఆయన పోప్‌ను ఆహ్వానించారు ..