Cherlapally Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
ఈ వార్తాకథనం ఏంటి
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
ఢిల్లీ నుంచి ఈ ప్రారంభం జరుగనుంది. అత్యాధునిక హంగులతో, ఎయిర్‌పోర్ట్‌ను తలపించే విధంగా ఈ టెర్మినల్‌ను రూపకల్పన చేశారు.
రూ.430 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం పూర్తయింది.
ఇందులో 9 ప్లాట్‌ఫాములు, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, 2 విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు.
పాత రైల్వే స్టేషన్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయంగా చర్లపల్లి స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
వివరాలు
ఈ నెల 18 నుంచి ప్రత్యేక రైళ్లు
ప్రారంభానికి ముందే చర్లపల్లి టెర్మినల్ నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 18 నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ఆర్టీసీ, ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులో ఉంచుతామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ టెర్మినల్ నుంచి మొత్తం 26 రైళ్ల ఆపరేషన్లు జరగనున్నాయి. భవిష్యత్తులో 30కి పైగా రైళ్లను ఈ టెర్మినల్ ద్వారా నడిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.