LOADING...
PM Modi: మోదీ చేతుల మీదుగా రేపు నోయిడా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఏడాదికి 2 కోట్ల మంది ప్రయాణం
ఏడాదికి 2 కోట్ల మంది ప్రయాణం

PM Modi: మోదీ చేతుల మీదుగా రేపు నోయిడా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఏడాదికి 2 కోట్ల మంది ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. దేశ రాజధాని ప్రాంతంలో పెరుగుతున్న విమాన రద్దీకి ఇది పెద్ద ఊరటగా నిలవనుంది. నోయిడాలో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ రద్దీకి పరిష్కారంగా కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, ముఖ్యంగా పీక్ టైమ్‌లలో ఈ ఎయిర్‌పోర్ట్‌పై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో మరో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ అవసరం చాలాకాలంగా వ్యక్తమవుతూ వచ్చింది.

వివరాలు 

మొదటి దశ ప్రారంభం.. టెర్మినల్ పరిశీలన

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11,200 కోట్ల వ్యయంతో నోయిడాలోని జేవర్ ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో (PPP) రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఆధునిక సౌకర్యాలతో సిద్ధమైంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ (ఫేజ్-1)ను రేపు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన టెర్మినల్‌ను కూడా పరిశీలించనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కాగానే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఉన్న ప్రయాణికుల భారం గణనీయంగా తగ్గనుంది.

వివరాలు 

ముఖ్యాంశాలు

తొలి దశలో ఏటా సుమారు 12 మిలియన్లు (దాదాపు 2 కోట్లు) ప్రయాణికులు సేవలు పొందగలరు తదుపరి దశల్లో ఈ సామర్థ్యాన్ని 70 మిలియన్లు (7 కోట్లు) వరకు పెంచే ప్రణాళిక 3,900 మీటర్ల పొడవైన రన్‌వే నిర్మాణం - పెద్ద వైడ్‌బాడీ విమానాలకు అనుకూలం ఆధునిక నావిగేషన్ సిస్టమ్‌లు, ILS (Instrument Landing System), అప్‌డేటెడ్ లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు

Advertisement

వివరాలు 

అద్భుత కనెక్టివిటీ.. మల్టీ-మోడల్ హబ్

ఈ ఎయిర్‌పోర్ట్ యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఉండటంతో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. రోడ్డు, రైలు, మెట్రో సహా పలు మార్గాల ద్వారా ప్రయాణికులకు సులభంగా చేరుకునేలా మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా అభివృద్ధి చేశారు. అలాగే విమానాశ్రయం నిర్మాణంలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటల విమాన సర్వీసులు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రూ.11,200 కోట్లతో నిర్మాణం

Advertisement