PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: సీఎంలతో మార్చి 27న ప్రధాని మోదీ కీలక భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 27న కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుందని సమాచారం. ఆయా రాష్ట్రాల సన్నద్ధతపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో మాట్లాడిన ప్రధాని మోదీ, యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
వివరాలు
రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలసి "టీమ్ ఇండియా"గా పనిచేయాలి
ఇవి కొంతకాలం కొనసాగవచ్చని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఇది దేశానికి పరీక్షా సమయమని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలసి "టీమ్ ఇండియా"గా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.