
PM Modi: నేడు కాశీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 44 ప్రాజెక్టులను ప్రారంభించి కాశీ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధాని..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు(ఏప్రిల్ 11న)ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరానికి పర్యటనకు వస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా, ఆయన దాదాపు రూ.3,884 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఉదయం 10గంటల సమయంలో మోదీ లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుండగా,రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు.
విమానాశ్రయం నుంచి నేరుగా రాజతలాబ్ సమీపంలోని మెహందీగంజ్ ప్రాంతానికి ప్రయాణించి, మోదీ ఓ బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా ప్రధాని మొత్తం రూ.3,884.18 కోట్ల వ్యయంతో రూపొందించిన 44అభివృద్ధి ప్రాజెక్టులను వారణాసివాసులకు అంకితం చేయనున్నారు.
అందులో రూ.1,629.13 కోట్లతో నిర్మించనున్న 19ప్రాజెక్టులను ప్రారంభించనుండగా,మిగతా 25 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
వివరాలు
పాల ఉత్పత్తిదారులకు బోనస్
ఈ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా, బాబత్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో, యూనిటీ మాల్ దగ్గరనున్న జాతీయ రహదారి పై అండర్‌పాస్ టన్నెల్ వంటి పనులతో కలిపి,మొత్తం రూ.2,255.05కోట్ల విలువైన పనులు ఉన్నాయి.
అదనంగా,ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలోని కార్డులను ప్రజలకు అందించనున్నారు.
ఇందులో భాగంగా, 70ఏళ్లు దాటి ఉన్న ముగ్గురు వృద్ధులకు మూడు భిన్నమైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ఉత్పత్తులతో పాటు ఆయుష్మాన్ కార్డు సర్టిఫికెట్లను అందజేయనున్నారు.
ఇంకా,బనాస్ డెయిరీతో కలసి పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 2.70లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు రూ.106 కోట్ల బోనస్‌ను ఆన్‌లైన్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈకార్యక్రమాలు పూర్తయ్యాక,ప్రధాని మోదీ తిరిగి బాబత్‌పూర్ విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి గ్వాలియర్‌కు బయలుదేరుతారు.