Page Loader
PM Modi: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా పాకిస్థాన్‌కు నరేంద్ర మోదీ వార్నింగ్‌ 
కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా పాకిస్థాన్‌కు నరేంద్ర మోదీ వార్నింగ్‌

PM Modi: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా పాకిస్థాన్‌కు నరేంద్ర మోదీ వార్నింగ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 26, 2024
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం తన ప్రసంగంలో పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ''గతంలో పాకిస్థాన్‌, పాల్పడిన వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయి.అయినా,చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు సరికదా..ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.ఈ రోజు నేను మాట్లాడే మాటలు.. ఉగ్రవాదులను తయారుచేస్తున్న వారికి (పాక్‌ సైన్యాన్ని ఉద్దేశిస్తూ) నేరుగా వినబడతాయి.ముష్కరులను పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు.మా దళాలు ఉగ్రవాదాన్ని నలిపివేసి.. శత్రువులకు తగిన జవాబిస్తాయి'' అని మోదీ పాక్‌ను హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని ప్రసంగాన్ని పూర్తిగా వినండి