Page Loader
PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..
103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..

PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 18 రాష్ట్రాల్లో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌ నుండి వర్చువల్‌ ద్వారా ప్రారంభించి దేశ ప్రజలకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట,కరీంనగర్,వరంగల్‌ రైల్వే స్టేషన్లు చోటు దక్కించుకున్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ కూడా ఈ పథకం కింద ప్రారంభించబడింది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం,ప్రధాన మంత్రి మోదీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారి అభిప్రాయాలను అడిగి,వారికి ప్రోత్సాహం అందించారు. రాష్ట్రాల వారీగా చూస్తే,ఉత్తరప్రదేశ్‌లో 19,గుజరాత్‌లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 స్టేషన్లు అమృత్‌ భారత్‌ పథకం కింద కొత్త రూపం దాల్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..