LOADING...
Andhra Pradesh: 440 రోజుల్లో పోలవరం డయాఫ్రం వాల్‌ పూర్తి.. పోలవరం పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం
పోలవరం పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం

Andhra Pradesh: 440 రోజుల్లో పోలవరం డయాఫ్రం వాల్‌ పూర్తి.. పోలవరం పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 440 రోజుల్లో పూర్తి చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం ఈ పనులు ముగియడంతో ఆయన అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. నిర్మాణంలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు, అధికారులతో కలిసి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ, గతంలో వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం వల్ల పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రజల్లో అనుమానాలు ఏర్పడ్డాయని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి, లక్ష్యాల ప్రకారం ముందుకు సాగుతూ డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిందని వివరించారు.

వివరాలు 

2027 జూన్‌ నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తి

నిపుణుల సూచనల మేరకు 2025 జనవరి 18న పనులు ప్రారంభించి,కేవలం 440 రోజుల్లో 1372 మీటర్ల పొడవునా నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఇది ప్రాజెక్టు నిర్మాణంలో ఒక కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. 2027 జూన్‌ నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి, పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాల కారణంగా కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అదనంగా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని విమర్శించారు. అనంతరం,డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో భాగమైన బావర్‌ కంపెనీ ఇంజినీర్లు,డివిజన్‌-3 జలవనరుల శాఖ అధికారులను మంత్రి అభినందించి సత్కరించారు.

Advertisement