LOADING...
Polavaram: రూ.7.48 కోట్లతో పోలవరం కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్
రూ.7.48 కోట్లతో పోలవరం కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్

Polavaram: రూ.7.48 కోట్లతో పోలవరం కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 13.150 కిలోమీటరు వద్ద అదనపు నీటి విడుదల కోసం సర్‌ప్లస్‌ ఎస్కేప్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ ఎస్కేప్‌ నుంచి వచ్చే ప్రవాహ కాలువ పుష్కర ఎత్తిపోతల పథకం కాలువను 12.885 కిలోమీటరు వద్ద దాటనుంది. ఈ దాటే ప్రాంతంలో డ్రెయిన్‌ సైఫర్‌ నిర్మాణాన్ని కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఈ రెండు పనులను గతంలో ఎడమ కాలువ మొదటి ప్యాకేజీలో కొంత భాగం నిర్వహించిన గుత్తేదారు సంస్థకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వివరాలు 

2017లో రూ.171.39 కోట్ల విలువైన పనులు 

2017 ఒప్పంద ధరల ప్రకారం ఆ సంస్థ రూ.171.39 కోట్ల విలువైన పనులను అప్పట్లో పూర్తి చేసింది. అదే ధరలతో ఈ కొత్త పనులు చేయడానికి అంగీకరించడంతో, రెండు పనులను కలిపి రూ.7.48 కోట్లకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement