తదుపరి వార్తా కథనం

HYD: కొండాపూర్ రేవ్ పార్టీపై పోలీసుల దాడి.. 11 మందిపై కేసు నమోదు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 27, 2025
11:17 am
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో నగరంలో కలకలం రేపిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీలో ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, 9 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 6 కార్లు, వివిధ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాల్లో మొత్తం 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్, 11.57 గ్రాముల మ్యూజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరాస్ డ్రగ్స్ లభ్యమయ్యాయి.
Details
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
పోలీసులు పట్టుకున్న నిందితులను శేరిలింగపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఇక ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మాదకద్రవ్యాల వినియోగం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి తెలియజేస్తోంది.