Page Loader
Bjp Mla-Raja singh-Case: ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదు

Bjp Mla-Raja singh-Case: ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదు

వ్రాసిన వారు Stalin
Apr 22, 2024
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

గోషామహల్ (Goshamahal)ఎమ్మెల్యే (Mla)రాజాసింగ్ (Rajasingh) పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి (Sri Ramanavami) రోజు నిర్వహించి శోభాయాత్ర (Sobha Yathra)లో హనుమాన్ వ్యాయామశాల వద్ద ప్రసంగించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. సుల్తాన్ బజార్ (Sultan Bazar) పోలీస్ స్టేషన్(Police station)లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ ఐ మధుసూదన్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పీఎస్ లో రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, 290 రెడ్ విత్ 34, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ నెల 18 న కేసు నమోదు చేసినప్పటికీ ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Raja Singh-Bjp mla

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో...

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. బీజేపీ ఏకంగా కొన్ని రోజుల పాటు రాజాసింగ్ పై సస్పెన్షన్ కూడా విధించిన సంగతి తెలిసిందే.