CPR To Snake : పాముకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీస్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీస్ పాముకు సీపీఆర్ చేశారు. చింద్వారా జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అతుల్ శర్మ పచ్‌మర్హి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం దసరా సందర్భంగా ఆన్ డ్యూటీలో ఉన్న ఈ పోలీస్, పాముకు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్ ) చేశారు. నర్మదాపురంలోని తవా కాలనీ వాసులు తమ ఇళ్లల్లోకి పాము వచ్చిందని పోలీసులకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో వచ్చిన పోలీస్, పాము ఉన్న ఇంటికి వెళ్లి చూడగా, అది సమీపంలోని పైపుల్లోకి వెళ్లి దాక్కుంది. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, పురుగుల మందులు కలిపిన బకెట్ నీటిని దాని మీద పోసేశారు. ఈ మేరకు పాము విషపు నీటిలో స్పృహతప్పి పడిపోయింది.
గుండె కొట్టుకోవడం స్థంభించిన వారికి తక్షణమే రక్తం సరఫరా చేసే విధానం సీపీఆర్
అతుల్ శర్మ పాముల సంరక్షకుడు కనుక పామును బయటకుతీసి దాని నోటిని కడిగాడు. ఈ క్రమంలో పాము నోటి వద్ద తన నోటిని ఉంచి గాలి అందించారు. గంట తర్వాత సదరు పాము స్పృహలోకి వచ్చేసింది.అనంతరం దాన్ని తీసుకెళ్లి సమీప అటవీలో వదిలిశారు. గుండె పనితీరు అకస్మాత్తుగా ఆగిపోయే క్రమంలో గుండె కొట్టుకోవడం స్థంభించిన వారికి తక్షణమే రక్తం సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో ఊపిరితిత్తులు తాజా ప్రాణవాయువు తీసుకునేలా చేయాలి. ఈ నేపథ్యంలోనే పేషంట్ నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందించాల్సి ఉంటుంది. సాధారణంగా మనుషులకు ఈ సీపీఆర్ చేస్తుంటారు. కానీ తొలిసారిగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ పాముకు సీపీఆర్ చేసి, దాని ప్రాణాలను రక్షించాడు.