LOADING...
Trap House Party: మైనర్ల ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసులు దాడి.. మత్తులో 50 మంది!
మైనర్ల ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసులు దాడి.. మత్తులో 50 మంది!

Trap House Party: మైనర్ల ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసులు దాడి.. మత్తులో 50 మంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొయినాబాద్‌లో మంగళవారం ఒక ట్రాప్‌ హౌస్ పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మైనర్లు జట్టుగా చేరి పెద్ద పరిమాణంలో పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలో డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగరానికి చెందిన ఒక డీజే, ఇన్‌స్టా యాప్‌లో 'ట్రాప్ హౌస్.9ఎంఎం' పేరుతో ఖాతా నిర్వహిస్తూ, మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పార్టీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఇది సాధారణ పార్టీ కాకుండా, 'ఇక్కడకు రావడం ద్వారా అద్భుతమైన ఆనందాన్ని ఆస్వాదించవచ్చునని ప్రాచారం చేశాడు.

Details

కేసు నమోదు చేసిన పోలీసులు

శనివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే పార్టీలో పాల్గొనడానికి ఒక్కరికి రూ.1,600, జంటలకు రూ.2,800 చార్జ్ పెట్టాడు. ఇన్‌స్టా పోస్టర్ చూసి వివిధ ప్రాంతాల నుంచి 50 మంది మైనర్లు పార్టీకి హాజరయ్యారు. పార్టీలో మత్తులో ఉన్నపుడు, రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. డ్రగ్ పరీక్షల్లో ఇద్దరు మైనర్లు గంజాయి వాడినట్టు తేలింది. అదనంగా ఆరుగురు నిర్వాహకులను, 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మైనర్ల కుటుంబ సభ్యులను సమాచారం అందించి తగిన చర్యలు చేపట్టారు.