Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్ వీడియో కేసులో పోలీసులు మరొక నిందితుడిని గుర్తించి అరెస్టు చేసారు. అతడి పేరు యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (19)గా పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 5కు చేరుకుంది.
మణిపూర్‌లో వర్గం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు చూపుతున్న వీడియో బుధవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోలో కుకి-జో కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను ఒక వర్గం నగ్నంగా ఉరేగిస్తున్నట్లు కనిపిస్తుంది.
మణిపూర్
ఆ వీడియోను బ్లాక్ చేయాలని ట్వీట్టర్‌కు కేంద్రం ఆదేశం
హుయిరేమ్ హెరాదాస్ సింగ్ అనే 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు పట్టుకున్నప్పుడు మొదటి అరెస్టు జరిగింది. అనంతరం అతని ఇంటికి కొందరు మహిళలు నిప్పు పెట్టారు.
ఈ క్రమంలో నగ్నంగా ఉన్న మహిళల వీడియోలను షేర్ చేయవద్దని కేంద్రం ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మహిళలను తమ తల్లిగా భావిస్తారని అన్నారు.
అయితే ఇద్దరు గిరిజన మహిళలపై దుండగులు చేసిన దుశ్చర్య వల్ల రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారన్నారు.
ఈ ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు.