
YS Jagan Tour: జగన్ పర్యటనపై చిత్తూరు జిల్లా పోలీసుల ఆంక్షలు అమలు.. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే..
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా,కనీస మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మామిడి రైతులను ఆయన కలిసి పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో,పర్యటనను ముందుంచుకొని జిల్లా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లతో పాటు కొన్ని ఆంక్షలను అమలు చేశారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాతో మాట్లాడుతూ, జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటివరకు 375 మందికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇది కేవలం రైతులతో నిర్వహించే పరస్పర సంభాషణ కార్యక్రమం మాత్రమేనని, అయితే కొంతమంది దీన్ని జనసభలుగా మలచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
వివరాలు
రైతుల సంఖ్యను 500 మందికి పరిమితం..
ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్దమవుతున్నారు.. ఆటోల ద్వారా జనాలను తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.. వెల్లడించారు. ఇలాంటి చర్యలు తీసుకునే వారిపై స్పష్టమైన ఆధారాలుతో కేసులు నమోదు చేయడం తో పాటు, అవసరమైతే రౌడీషీట్లు కూడా ఓపెన్ చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇక, గతంలో సత్యసాయి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యం చూస్తే, ఈసారి అధికారులు మరింత కఠినంగా వ్యవహరించక తప్పదని ఎస్పీ మణికంఠ వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే రైతుల సంఖ్యను 500 మందికి పరిమితం చేస్తున్నామని, అదనంగా హెలిప్యాడ్ వద్దకు వెళ్లే 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.