
AP Deputy CM Pawan: పోలీసులు త్యాగాలు ప్రతి పౌరుడికీ ఆదర్శం : పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వీర పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని ఆయన పోస్టులో తెలిపారు. శాంతి, భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. పోలీసుల త్యాగం, సేవ తర తరాలను ప్రేరేపిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
Details
పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి
ప్రజా భద్రత, చట్టం, శాంతి పరిరక్షణలో పోలీసులు అప్రతిహతంగా పని చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాక, క్రైమ్ రేటు తగ్గించడంలో పోలీసులు చేపట్టే ప్రణాళిక, ప్రజల రక్షణకు తీసుకునే దృష్టికోణం ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసే పోలీసుల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.