Page Loader
Bihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే.. 
Bihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే..

Bihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే.. 

వ్రాసిన వారు Stalin
Dec 19, 2023
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో గతవారం జరిగిన శివాలయ పూజారి మనోజ్ సాహ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడించారు. మనోజ్ సాహ్ ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. మహిళకు పెళ్లికి ముందు వీరి మధ్య శారీరక సంబంధం ఉండేదని, అయితే వివాహం తర్వాత కూడా తనతో శారీర సంబంధం కొనసాగించాలని ఆ మహిళను మనోజ్ సాహ్ ఒత్తి తెచ్చినట్లు వివరించారు. తన ప్రియురాలితో సన్నిహతంగా ఉన్న తీసిన వీడియోలను చూపించి.. ఆమెను బెదిరించి, బలవంతంగా సెక్స్ చేసేవాడు. దీంతో ఆ మహిళ మనస్తాపానికి గురైంది.

హత్య

సొదరుడు, అత్తతో కలిసి హత్య

ఒకరోజు పూజారి మనోజ్ సాహ్‌ను తన తల్లి ఇంటికి పిలిపించింది. తన సోదరుడు, అత్తతో కలిసి అతన్ని హత్య చేసింది. ఈ కేసులో నిందితురాలితో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు గోపాల్‌గంజ్ జిల్లాలోని మంఝఘర్ పోలీస్ స్టేషన్‌లోని దానాపూర్ గ్రామానికి సంబంధించినది. మృతుడు గ్రామంలోని శివాలయం పూజారి. తన ప్రియురాలిపై అసభ్యకరమైన వీడియో తీసి వైరల్‌ చేస్తానని బెదిరించడంతో మనోజ్‌ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నలుగురిని సిట్ అరెస్టు చేసింది. హత్యకు ఉపయోగించిన కత్తి, తాడు, సల్వార్, మృతుడి ఫోన్, మరో రెండు మొబైల్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.