
Bihar Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. మేనల్లుడిపై అనుమానం
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లోని నవాడా జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ ఇంట్లో శనివారం 24 ఏళ్ల యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది.
ఈ మేరకు రంగంలోకి దిగిపరారీలో ఎమ్మెల్యే మేనల్లుడున పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ప్రారంభించారు. చనిపోయిన యువకుడిని పీయూష్ సింగ్‌గా గుర్తించారు.
పీయూష్ ఎమ్మెల్యే నీతూ సింగ్‌కు దూరపు బంధువని నవాడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అంబరీష్ రాహుల్ తెలిపారు.
పోలీసులు పీయూష్ సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో నీతూ సింగ్ ఇంట్లో లేరు.
నీతూ సింగ్ గత కొన్ని రోజులుగా పాట్నాలో ఉంటున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆమె కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఎవరూ ఇంట్లో లేరు.
కాంగ్రెస్
పరారీలో ఎమ్మెల్యే మేనల్లుడు
ఎస్పీ అంబరీష్ రాహుల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఎమ్మెల్యే నీతూ సింగ్ ఇంట్లో మృతదేహం ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది.
అనంతరం ఒక పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. నీతూ సింగ్ మేనల్లుడు గోలు సింగ్‌కు చెందిన గదిలో పీయూష్ సింగ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
అనంతరం పోలీసులు కేసును దర్యాప్తు చేయడానికి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా పిలిపించారు.
శనివారం సాయంత్రం 7 గంటలకు గోలు సింగ్ గదిలోకి వెళ్లిన పీయూష్ సింగ్ ఇంటికి తిరిగి రాలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పీయూష్ సింగ్‌ను రాత్రి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.