తదుపరి వార్తా కథనం

Polio: ఈ నెల 12 నుంచి పోలియో చుక్కలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 10, 2025
04:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లల భవిష్యత్తు కోసం పోలియో టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 12న ఐదేళ్లకన్నా తక్కువ వయస్కు చెందిన 5,17,238 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ టీకా కార్యక్రమం 2,843 కేంద్రాల్లో జరగనుందని కలెక్టర్ వెల్లడించారు. కేంద్రాలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు.
వివరాలు
ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు
ఈ కార్యక్రమంలో భాగంగా, 13, 14, 15 తేదీల్లో సుమారు 11,200 మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. నగరంలో 164 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, డీఎంవో డాక్టర్ రాములు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.